Breaking News

హీరో విశాల్ బండారం బయటపెడతానంటున్న రమ్య


తమిళ స్టార్ హీరో ఇటీవలే తన ఆఫీసులో పనిచేస్తున్న రమ్య అనే మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆఫీసులో పనిచేస్తున్న ఆమె తనకు తెలియకుండా రూ. 45 లక్షలు కాజేసిందని పోలీసుల్ని ఆశ్రయించాడు. నిర్మాతగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాలు తీస్తున్న ఆయన, హరి, రమ్య అనే ఇద్దరిని ఉద్యోగులుగా నియమించుకోగా, ఇరువురూ కలిసి ఆరేళ్ల వ్యవధిలో లక్షల డబ్బు కొట్టేశారన్నది విశాల్ వారిపై ఆరోపణలు చేశాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై రమ్య ఘాటుగా స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్, వాస్తవానికి పెద్ద విలన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు దానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన రమ్య తన వద్ద ఉన్న వివరాలన్నీ చెబితే, విశాల్ నిజస్వరూపం బయట పడుతుందని హెచ్చరించింది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, మహిళను కావడం వల్లే తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి... సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతానని హెచ్చరించింది. దీంతో విశాల్ విషయం అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించింది. రమ్య విశాల్ పై చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విశాల్‌ ప్రస్తుతం హీరోగా నటిస్తూ చక్ర, తుప్పరివాలన్‌ 2 చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఇటీవలే విడుదలైన చక్ర ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఎంఎస్ ఆ‌నందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా విశాల్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమ ఎన్నికల నుంచి ఆయనపై తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, రమ్య చేసిన ఆరోపణలపై విశాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


By July 07, 2020 at 09:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vishal-film-factor-employee-ramya-says-to-media-vishal-is-villain/articleshow/76825964.cms

No comments