గుట్టల్లో అక్రమ జంటల రాసలీలలు.. బెదిరించి దోచుకుంటున్న నకిలీ పోలీస్
వివాహేతర సంబంధాలతో చాటుమాటుగా కలుసుకునే జంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి నగదు, బంగారం దోచుకుంటున్న నకిలీ పోలీసును కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా చిలుకూరు మండల పరిధిలోని సీతారాంపురం సమీపంలో కోదాడ– హుజూర్‌నగర్ రహదారి సమీపంలో పెద్ద గుట్టలు ఉన్నాయి. ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం పెట్టుకున్న జంటలు తరుచూ అక్కడికి వస్తుండటంతో క్రమంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఆ జంటలను బెదిరించి దోచుకుంటున్నారు. Also Read: ఈ క్రమంలోనే శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన ఓ మహిళతో కలిసి ఆ గుట్టల్లోకి వెళ్లాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి పోలీసు వేషంలో వచ్చి ఫోటోలు తీశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోలను బహిర్గతం చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అదను చూసి యువతి అక్కడి నుంచి పారిపోగా ఆ నకిలీ పోలీసు శ్రీకాంత్ రెడ్డి నుంచి రూ.5వేల నగదు తీసుకుని వదిలిపెట్టాడు. మళ్లీ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు 3వ తేదీన కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని నల్లగుట్టకు చెందిన ఉపాధ్యాయ సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారింగా నేరం అంగీకరించాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు విచారణలో చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By July 07, 2020 at 09:09AM
No comments