Breaking News

హైకోర్టు ఎదుట కూరగాయలు అమ్మకుంటున్న న్యాయవాది


కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడింది. అందరి ఉద్యోగాలపైన, అన్నిరకాల వృత్తులు చేపడుతున్న వారిపైనా పడింది. దీంతో అనేకమంది ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ఇప్పటికే ఉపాధి లేక కూరగాయలు, పండ్లు అమ్ముకున్నారు. ఓ దర్శకుడు అయితే ఏకంగా కిరాణా షాపే పెట్టుకున్నాడు. తాజాగా ఓ న్యాయవాది తాను పను చేసిన హైకోర్టు ఎదుటే కూరగాయలు అమ్ముతున్నాడు. ఒడిశా హైకోర్టుకు చెంది న్యాయవాది సపన్ పాల్ కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఎలాంటి కేసులు రావడం లేదు. దీంతో అతనికి పూట గడవని పరిస్థితి. బార్ కౌన్సిల్ ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ నుంచి కూడా సాయం అందలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ సాయం ప్రకటించిందని కానీ న్యాయవాదుల గురించి మాత్రం ఆలోచించలేదని సపన్ పాల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిలో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో సరుకులు ఎలా కొనుగోలు చేయాలని ప్రశ్నించాడు. లాక్ డౌన్ విధించి మూడు నెలలు అయ్యిందని ఇప్పటివరకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి సాయం అందలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి సమయంలో తన భార్య, బిడ్డలకు విషం ఇచ్చి చంపేయాలా ? అందుకే గతిలేక కూరగాయలు అమ్ముకుంటున్నానని లాయర్ సపన్ పాల్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక సాయం కోసం బార్ కౌన్సిల్‌కు 15వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని స్క్రూట్నీ చేసే పనిలో బార్ కౌన్సిల్ అధికారులు బిజీగా ఉన్నారన్నారు.


By July 11, 2020 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lawyer-sells-vegetables-outside-orissa-high-court/articleshow/76903489.cms

No comments