Breaking News

భర్తని చంపేసి భార్య హైడ్రామా.. ఊహించని షాకిచ్చిన కూతురు


ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తని దారుణంగా చంపేసిందో కసాయి భార్య. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం గుండోపోటుతో మరణించాడంటూ హైడ్రామాకు తెరతీసింది. నమ్మేసిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించేశారు. తీవ్ర దు:ఖంలో ఉన్నట్లు నటిస్తున్న భార్యకి కూతురి రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. అమ్మే నాన్నని చంపేసిందని చిన్నారి పెదనాన్నకి చెప్పడంతో కథ అడ్డం తిరిగి కటకటాలపాలైంది. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పరిధిలోని నింపురాకి చెందిన ఈశ్వరరావు(44) రైల్వే కాలనీలో నివాసం ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో అతని భార్య పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలసి హత్య చేసింది. నిద్రిస్తున్న ఈశ్వరరావుకి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా చంపేశారు. అనంతరం భార్య హైడ్రామాకు తెరతీసింది. తన భర్త నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని అంత్యక్రియలు జరిపించేశారు. ఇంతలో కూతురు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. నాన్నని అమ్మే చంపేసిందని.. ఆమె ప్రియుడితో కలసి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని పెదనాన్న వెంకటరమణకి చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. తమ్ముడి మరణంపై అనుమానాలున్నాయని.. అతని భార్యే ప్రియుడితో కలసి హత్య చేసిందని వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రిని హత్య చేస్తున్న సమయంలో కూతురు చూసిందని పోలీసులు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టు హాజరుపరిచారు. Read Also:


By July 27, 2020 at 11:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-paramour-in-kharagpur/articleshow/77192182.cms

No comments