కనబడుటలేదు: ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఫింగర్ ప్రింట్స్, ఫోటోలతో!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కంటెంట్ ప్రాధాన్యమున్న చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొత్త తరహా సినిమాలతో ఆకట్టుకుంటున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ''. సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలరాజు దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్.ఎస్. ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సరయు తలశిల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ 'కనబడుటలేదు' మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడగట్టిన కొన్ని ఫొటోల వంక సీరియస్‌గా చూస్తుండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టైటిల్‌పై ఓ ఫింగర్ ప్రింట్ వేసి జనాల్లో ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. అతిత్వరలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసి మరోసారి థ్రిల్ చేస్తామని అంటోంది చిత్రయూనిట్. Also Read: ఈ చిత్రంలో యుగ్ రామ్, శశిత కోన, నీలిమ పెతకంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ రాజు, ఉమామహేశ్వర రావు, కిశోర్, శ్యామ్, మధు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తుండగా, సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ కుర్మాన ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
By July 27, 2020 at 10:47AM
No comments