ఆ ఇద్దరూ నాలుగు నెలలుగా వేధిస్తున్నారు.. సినీ నటి ఆవేదన.. ఆత్మహత్యాయత్నం
సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారని పేర్కొంటూ తమిళ నటి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రక్తపోటు పడిపోయి మరణం సంభవించే పిల్స్ వేసుకోవడంతో.. ఆ విషయం తెలిసి స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. అయితే కొందరి వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతకుముందు ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించడం సంచలనంగా మారింది. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పనన్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. వాళ్ళను అస్సలు వదలొద్దని తెలుపుతూ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వీడియో పోస్ట్ చేసింది నటి విజయలక్ష్మి. ఈ వీడియో ద్వారా ఆమె ''ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర మనోవేదనకు గురవుతున్నా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా. నా చావు కనువిప్పు కావాలి. వాళ్ళను అస్సలు వదలొద్దు'' అని తెలిపింది. కాగా విజయలక్ష్మి తెలిపిన ‘నామ్ తమిళర్ కచ్చి’ అనేది జాతీయ పార్టీ. ఆ పార్టీ నాయడుకే సీమన్. అదేవిధంగా రాజకీయ సంస్థ ‘పనన్‌కట్టు పడై’కి చెందిన వ్యక్తి హరి నాడార్. అయితే ఈ ఇద్దరూ ఆమెను ఎందుకు వేధిస్తున్నారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
By July 27, 2020 at 08:10AM
No comments