ప్రేమించలేదని బాలిపై వేడి నూనె పోసిన యువకుడు
అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కొందరు మగాళ్లు మాత్రం మృగాలుగా మారి ఆడవారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో కొందరు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా 14 ఏళ్ల బాలిక తనను ప్రేమించడం లేదని ఆమెపై వేడి నూనెతో దాడి చేశాడు ఓ యువకుడు. పుదుచ్చేరి రాష్ట్రం కిరుమాంబాక్కం ప్రాంతాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మాదేష్ అనే యువకుడు ప్రేమించాడు. బాలిక వెంట పడ్డాడు. ఆమె కూడా తనను ప్రేమించాలని వేధింపులకు దిగాడు. దీనికి ఆ బాలిక అంగీకరించకపోవడంతో గత నెల 18వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఆమెపై వేడి నూనె పోశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఫిర్యాదుతో కిరుమాంబాకం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మాదేష్‌ను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
By July 02, 2020 at 09:34AM
No comments