‘సోషల్‌మీడియాలో ఆ ఫోటోలు పెట్టి పరువు తీస్తా’... యువతికి సైబర్ వేధింపులు
స్నేహం పేరుతో యువతితో సన్నిహితంగా మెలిగి ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతికి కొంతకాలం క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సరదాగా మాట్లాడే అతడు తరుచూ పార్టీలకని అనేక ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. ఎక్కడికెళ్లినా ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేవాడు. ఓ పార్టీలో ఆమె చేతిలో బీరు బాటిల్ పెట్టి ఫోటోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేయగా ఆమె నిరాకరించింది. ఒత్తిడి తీసుకురావడంతో అతడిని దూరం పెట్టింది. Also Read: దీంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు బీరు బాటిల్‌తో దిగిన ఫోటోలలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని, తనను ప్రేమించకపోతే పరువు తీస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి మీ తల్లిదండ్రులు, బంధువులకు పంపుతానంటూ బెదిరించాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఏసీపీ హరినాథ్ ఆదేశాలతో రంగంలోకి దిగి పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By July 25, 2020 at 08:36AM
No comments