డేరా బాబా ట్రైలర్: రామ్ లోపాల వర్మ అంటూ పంచులే పంచులు.. రంగంలోకి జబర్ధస్త్ కమెడియన్
ఇన్నాళ్లు అందరినీ టార్గెట్ చేస్తూ తనదైన నైజంతో సంచలనాలు సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ టార్గెట్‌లో పడ్డారని తెలుస్తోంది. అందరినీ బుట్టలో వేసుకునే లాజిక్స్ మాట్లాడుతూ దూసుకుపోతున్న ఆర్జీవీ 'పవర్ స్టార్' పేరుతో సినిమా రూపొందస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ''ఎన్నికల తర్వాత కథ'' అనే ట్యాగ్ లైన్ పెట్టేసి అచ్చం పవన్ కళ్యాణ్, చిరంజీవిలను పోలిన నటులతో సెన్సేషనల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న వర్మపై కొందరి కన్ను పడింది. సంచలనాలు క్రియేట్ చేయడం, లాజికల్‌గా మాట్లాడటం మాకు కూడా తెలుసంటూ ఆర్జీవీని రిటర్న్ టార్గెట్ చేస్తూ సినిమాలు స్టార్ట్ చేసేశారు పవన్ ఫ్యాన్స్. ఈ క్రమంలో ఇప్పటికే 'పరాన్నజీవి' పేరుతో వర్మను కడిగిపారేసే పనిలో పడ్డ ఫ్యాన్స్.. తాజాగా ఆయనపై మరో సినిమా ప్రకటించారు. వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి '' అనే టైటిల్ ఫిక్స్ చేసి షకలక శంకర్‌ని రంగంలోకి దించేశారు. అంతేకాదు ట్రైలర్ రూపంలో ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేసి ఆర్జీవీ దుమ్ము దులిపారు. Also Read: ఆర్జీవీని ఓ లేడీ ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా రూపొందించిన ఈ ట్రైలర్‌లో మనోడిని ఓ ఆట ఆడేసుకున్నారు. ముఖ్యంగా ఆయన లోపాలపైనే ఫోకస్ పెట్టి ‘రామ్ లోపాల వర్మ’ అంటూ పంచులు మీద పంచులు విసిరారు. దీంతో క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన పవన్ అభిమాన వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. వీరు. కె. రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'డేరా బాబా' వెబ్ సిరీస్‌లో ఆర్జీవీ పాత్రను షకలక శంకర్ పోషిస్తున్నాడు. మొత్తంగా చూస్తే వర్మ 'పవర్ స్టార్' విడుదలయ్యే సరికి పవన్ ఫ్యాన్స్ ''పరాన్నజీవి, డేరా బాబా'' అప్‌డేట్స్‌తో ఆర్జీవిని పరేషాన్ చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఈ తిరుగుబాటు వీడియోలపై సంచలనాల దర్శకుడు ఎలా రియాక్ట్ అవుతాడనేది.
By July 21, 2020 at 12:20PM
No comments