కొద్ది మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా బ్రిటన్ యువరాణి వివాహం
ఓ వ్యాపారవేత్తతో శుక్రవారం సాదాసీదాగా జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా ఈ వేడుక జరగడం విశేషం. బ్రిటన్ రాజు పెద్ద కుమార్తె, రాణి ఎలిజబెత్-2 మనవరాలు, యువరాణి ప్రిన్సెస్ బీట్రెస్ ఇటలీకి చెందిన వ్యాపారవేత్త మాపెల్లి మొజ్జీ వివాహం చేసుకున్నారు. బీట్రెస్ వయసు 31 ఏళ్లు కాగా, మొజ్జిని వయసు 35 ఏళ్లు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితులు, బంధువులనే వివాహానికి ఆహ్వానించారు. యువరాణి బీట్రెస్ వివాహం గురించి వెల్లడించిన బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు, కొత్త జంటకు పలువురు రాజ వంశీయులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా, తొలుత ఈ వివాహం మే 29న లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిపించేందుకు నిశ్చయించారు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ విధించారు. దీని కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో జులై 17న జరిపించాలని నిర్ణయించినా దీనిపై ప్రకటన చేయలేదు. నిరాడంబరంగా రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వివాహం నిర్వహించారని, వారిద్దరూ ఒకటయ్యారని రాజ కుటుంబం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వివాహంపై ఎలిజిబెత్-2 మాట్లాడుతూ.. ‘నా మనవరాలి పెళ్లి ఈ ఉదయమే జరిగింది. ఫిలిప్ సహా నేను అక్కడకు వెళ్లామని, ఎంతో సంతోషంగా ఉంది’అని అన్నారు. కాగా, యువరాణి బీట్రెస్, మొజ్జీ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాలకు చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. బీట్రెస్ సోదరి యూజిని వివాహంలో తొలిసారి ఇద్దరూ కలిశారు. దాదాపు రెండేళ్ల కిందట 2018 అక్టోబరులో అట్టహాసంగా ఈ పెళ్లి జరగ్గా.. దాదాపు 1,000 మంది వరకు ప్రముఖులు హాజరయ్యారు. బ్రిటన్ సింహాసనానికి తొమ్మిదో స్థానంలో ఉన్న బీట్రైస్.. కృత్రిమ మేధస్సు సాఫ్ట్‌వేర్ సంస్థ అఫినిటీ వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇక, మొజ్జీ.. మాజీ ఒలింపియన్ అలెస్సాండ్రో మాపెల్లి మొజీ, నిక్కీ విలియమ్స్ ఎల్లీస్ కుమారుడు.
By July 18, 2020 at 12:43PM
No comments