భర్తలేని సమయం చూసి నవవధువుపై అత్యాచారం.. నెల్లూరులో దారుణం
జిల్లాలో నవవధువుపై బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. మండంలోని ఓ గ్రామానికి చెందిన చెందిన యువకుడికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. కొత్త దంపతులు గ్రామంలోని ఓ ఇంట్లో వేరు కాపురం ఉంటున్నారు. శనివారం భర్త పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో మహిళ ఒంటరిగా ఉంది. ఈ సంగతి తెలుసుకున్న బంధువుల కుర్రాడు ఇంటికి వెళ్లి ఆమెతో మాటలు కలిపాడు. అదను చూసి ఆమెను గదిలోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. తనపై జరిగిన బలత్కారాన్ని తలుచుకుంటూ కుమిలిపోయిన బాధితురాలు రాత్రి ఇంటికొచ్చి భర్తకు విషయం చెప్పింది. దీంతో అతడు ఆదివారం సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
By July 06, 2020 at 10:58AM
No comments