Breaking News

తాగుబోతు భర్తను ఉరేసి చంపిన భార్య.. చేవెళ్లలో దారుణం


మద్యానికి బానిసైన కుటుంబాన్ని వేధిస్తున్న వ్యక్తిని అతడి భార్య, పిల్లలే హత్య చేసిన ఘటన చేవెళ్లలో వెలుగుచూసింది. ఈ హత్యను సాధారణ మరణంగా చూపేందుకు వారు ప్రయత్నించగా మృతుడి సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మల్కాపూర్‌కు చెందిన నార్ల వెంకటయ్య(40)కు భార్య కమలమ్మ, కుమార్తె(20), కొడుకు(15) ఉన్నారు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించే అతడు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో భార్యను, పిల్లలను వేధించేవాడు. Also Read: దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ పరువు తీస్తున్నాడని పిల్లలు కూడా అతడిపై కక్ష పెంచుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటయ్యతో భార్య, పిల్లలు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి అతడి మెడకు తాడు బిగించి హత్య చేశారు. నిద్రలో చనిపోయినట్లు శుక్రవారం ఉదయం బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే వెంకటయ్య మెడపై గాయాలు గమనించిన అతడి సోదరి చంద్రమ్మ అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. Also Read: దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని పరిశీలింగా మెడకు ఉరేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కమలమ్మను విచారించగా పిల్లలతో కలిసి తానే ఉరేసి చంపినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 25, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-drunked-husband-with-help-of-childrens-in-ranga-reddy-district/articleshow/77161763.cms

No comments