ప్రేమ పేరుతో మోసం.. పెళ్లికి ముందే గర్భం.. యువకుడి అరెస్ట్
ప్రేమ పేరుతో యువతిని లొంగదీసుకుని గర్భవతిని చేసి పరారైన యువకుడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామానికి చెందిన కాకర వరుణ్ తేజ్(22), అదే గ్రామానికి చెందిన యువతి వెంట ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె అతడి ప్రేమను అంగీకరించాక షికార్లకు తిప్పుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. Also Read: ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో అతడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. అప్పటి నుంచి యువతి కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 8వ తేదీన కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరుణ్‌తో పాటు అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. వరుణ్‌తేజ్ తల్లిదండ్రులను ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. Also Read:
By July 14, 2020 at 09:03AM
No comments