Breaking News

విజయవాడ కరోనా వార్డులో కిలేడీ.. డాక్టర్ అవతారమెత్తి రోగుల నిలువుదోపిడీ


ఓ వైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా విలవిల్లాడుతుంటే.. మరోవైపు కొందరు అక్రమార్కులు దాన్ని కూడా క్యాష్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే కరోనా పేరుతో సైబర్ నేరగాళ్లు దోచుకుంటుంటే.. ఓ మహిళ కరోనా వార్డులో డాక్టర్ అవతారమెత్తి అందినకాడికి దోచుకుంటూ పోలీసులకు చిక్కింది. నగరంలోని కొవిడ్‌ ఆసుపత్రిలో శైలజ(43) అనే మహిళ కొద్ది రోజులుగా తాను డాక్టర్‌నంటూ హడావుడి చేస్తూ తిరుగుతోంది. Also Read: డాక్టర్లు డ్యూటీ ముగిసిన తర్వాత వారు ఉపయోగించే పీపీఈ కిట్లను ఆ ఆసుపత్రిలోనే ఉంచుతారు. వాటిని ధరించి కరోనా బాధితులకు సేవలు అందిస్తానని చెబుతూ వార్డుల్లో యథేచ్ఛగా తిరుగుతోంది. కిట్‌ వేసుకుని తిరుగుతుండడంతో అందరూ ఆమెను డాక్టరనే అనుకునేవారు. రోగులను పరీక్షిస్తున్నట్లు నటిస్తూ వారి సెల్‌ఫోన్లు దొంగిలించేది. రోగుల బంధువులతో మాట్లాడి మీ వారికి మెరుగైన సేవలు అందిస్తానంటూ డబ్బులు తీసుకునేది. ఇటీవల శైలజ పీపీఈ కిట్ ధరించే బయటకు వెళ్తుండటంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా పరారైంది. Also Read: బుధవారం కూడా అలాగే కిట్‌తోనే బయటకు వెళ్తుండగా మహిళా సిబ్బంది పట్టుకుని నిలదీశారు. ఆమె చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో మాచవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని శైలజను విచారించారు. తాను ఎంబీబీఎస్ చదివానని, ప్రసాదంపాడులో భర్త సత్యనారాయణతో కలిసి ఉంటున్నానని చెప్పింది. దీంతో పోలీసులు శైలజ గురించి ఆరా తీయగా ఆమెపై గతంలోనూ అనేక కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఆసుపత్రిలోకి అక్రమంగా ప్రవేశించడం, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటి నేరాలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శైలజ ఆగడాలపై లోతుగా దర్యాప్తు చేపట్టి కఠినచర్యలు తీసుకుంటామని సీఐ వినయ్‌ మోహన్‌ చెప్పారు. Also Read:


By July 30, 2020 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-booked-for-acting-fake-doctor-in-vijayawada-corona-hospital/articleshow/77253349.cms

No comments