Breaking News

కరోనా సోకడంతో పట్టించుకోని అత్తింటివారు.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య


పెళ్లయి ఐదేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని, అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటి వేధింపులు, ఇదే సమయంలో సోకడంతో కుటుంబసభ్యుల నిరాదరణకు గురికావడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో జరిగింది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతికి సమీప బంధువైన యువకుడితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు మనుమసిద్ధి నగర్‌లో ఉంటున్నారు. పెళ్లయి ఇన్నాళ్లైనా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దీనికి తోడు అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. Also Read: ఇదే సమయంలో బంధువుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అనుమానంతో ఆమెకు కూడా పరీక్షలు చేయించడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో అత్తింటి వారు ఆమెను ఇంట్లోని ఓ గదిలో ఉంచి పట్టించుకోవడం మానేశారు. శనివారం కుటుంబసభ్యులంతా కావలి వెళ్లగా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. అవమానాలు, చీత్కారాలతో బ్రతకడం కంటే చావే మేలనుకుని పురుగులమందు తాగేసింది. Also Read: కావలి నుంచి భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తకపోవడంతో కంగారుపడిన అతడు వెంటనే నెల్లూరులోని ఇంటికి చేరుకున్నాడు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఆమె విగతజీవిగా పడి ఉంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 05, 2020 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-nellore-over-harassment/articleshow/76793014.cms

No comments