Breaking News

మా బావగారు... వైఎస్ఆర్ జయంతిపై మోహన్ బాబు ట్వీట్


ఇవాళ ప్రముఖ దివంగత సీఎం, మహానేత అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రముఖులు, కుటుంబసభ్యులంతా ఆయన చేసిన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘స్నేహశీలీ, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ చేశారు. మోహన్ బాబుకు వైఎస్ఆర్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణువర్ధన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విరానికా రెడ్డి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సోదరి అవుతుంది. జగన్ తాతగారైన రాజారెడ్డి చిన్న కుమారుడు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతులకు పుట్టిన కుమార్తె విరానికా. ఈ విధంగా చూస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విరానికాకి పెదనాన్న అవుతారు. అందుకే జగన్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి కూడా ఎప్పుడూ సత్సంబంధాలుంటాయి. ఇక రాజకీయాలలోకి వచ్చిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు.


By July 08, 2020 at 11:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manchu-mohan-babu-tweet-on-ysr-birth-anniversary/articleshow/76848336.cms

No comments