డీసీఎంతో ఢీ కొట్టించి భర్త హత్య.. ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం
తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కక్షతో కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి చంపేసిందో ఇల్లాలు. ఆఫీసులో విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వస్తున్న అతడిని డీసీఎంతో ఢీకొట్టించి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది. అతడిని కారులో ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు నటించి మార్గమధ్యలో గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటనపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె కిరాతకం వెలుగుచూసింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లాలో జరిగింది. Also Read: మేడ్చల్ మండలం సైదోనిగడ్డ తండాకు చెందిన ధరావత్ సురేష్(36)కు బబితతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. సురేష్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బబిత సైదోనిగడ్డ గ్రామ 7వ వార్డు మెంబర్. ఆమెకు కొంతకాలంగా దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తన బంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని బబిత ప్లాన్ వేసింది. దీంతో ఆ జంట సురేష్ మర్డర్‌కు ప్లాన్ వేశారు. అజ్మెరప్రేమ్ అనే సుపారీ కిల్లర్‌తో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రేమ్‌సింగ్ రూ.70వేలు అడ్వాన్స్ చెల్లించాడు. Also Read: అజ్మెరప్రేమ్.. తన అనుచరులు రాహుల్, వజ్గోత్‌రాజుతో కలిసి నల్గొండ నుంచి స్విఫ్ట్ కారు, డీసీఎం తెప్పించాడు. మే 16న యాడారం సమీపంలో రెండుసార్లు హత్యకు యత్నించినా కుదరలేదు. మే 23న ఆఫీసు నుంచి ఇంటికి బైక్‌పై వస్తున్న సురేష్‌ను డీసీఎంతో ఢీకొట్టారు. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించి కారులో ఆస్పత్రికి తరలిస్తున్నట్లు నాటకమాడి మార్గమధ్యలో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రోడ్డుప్రమాదం జరిగిందని నమ్మబలికారు. Also Read: అయితే ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎన్నో షాకింగ్ విషయాలు తెలిశాయి. పోస్టుమార్టం రిపోర్టులో సురేష్ గొంతు నులమడంతో ఊపిరాడక చనిపోయాడని వెల్లడైంది. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేష్‌ది హత్యగా నిర్ధారించారు. బబిత, ప్రేమ్‌సింగ్ సహా ఐదుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, సీఐ ప్రవీణ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. Also Read:
By July 01, 2020 at 07:30AM
No comments