Breaking News

మెక్సికోలో దుండగుల కాల్పులు... 24 మంది మృతి


చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఘటనా స్థలం భయానకంగా మారింది. కాల్పుల ఘటన వెనుక డ్రగ్స్‌ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నెల రోజులుగా నగరంలో ఇది రెండవ ఘటన అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాల్పుల్లో పోలీసులు సైతం గాయాల పాలయ్యారు. మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 19 నెలల క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఇలాంటి దాడుల సంఖ్య కాస్త తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి వరుస దాడులు జరుగుతన్నాయి. తాజాగా జరిగిన కాల్పుల ఘటన 2020లో ఏడాదిలో అతి పెద్ద నరమేధంగా అక్కడి వారు భావిస్తున్నారు.


By July 02, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/24-dead-in-mexico-after-gunmen-storm-drug-rehab-facility/articleshow/76741656.cms

No comments