సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని.. రూ.21 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
‘‘డియర్ కస్టమర్, మీ సిమ్ కార్డ్ 24 గంటల్లో బ్లాక్ అవుతుంది. ఈ-కేవైసీని అప్డేట్ చేసుకోండి’’ అని మీ ఫోన్‌కు ఓ మెసేజ్ రాగానే కంగారు పడకండి. ఆ తర్వాత కస్టమర్ కేర్ ప్రతినిధిని అని చెబుతూ.. ఈ-కేవైసీ అప్‌డేట్ కోసం ఇలా చేయండి అని చెప్పగానే గుడ్డిగా నమ్మేయకండి. ఎందుకంటే ఇలాగే ఓ వ్యక్తి నుంచి ఈ-కేవైసీ పేరిట వివరాలు లాగేసిన సైబర్ కేటుగాళ్లు.. ఈ-సిమ్ తీసుకొని ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 9 లక్షలు కాజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సైబర్ మోసం వివరాలు మీకోసం.. మియాపూర్‌లో నివసించే ఎస్. అప్పలనాయుడికి జులై 11న ‘QP-TXTSMS’ నుంచి సిమ్ కార్డు బ్లాక్ అవుతుందంటూ.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ చేసుకోండంటూ ఓ మెసేజ్ వచ్చింది. తర్వాత కేటుగాడు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌నంటూ ఫోన్ ఆయనకు ఫోన్ చేశాడు. బాధితుడికి ఈ-మెయిల్ ఐడీ పంపిన కేటుగాడు... తను పంపిన మెయిల్ ఐడీని కస్టమర్ కేర్ నంబర్‌కు ఫార్వార్డ్ చేయాలని కోరాడు. అతడు చెప్పినట్లు చేయగానే.. మొబైల్ ఈ-మెయిల్ రిజిస్ట్రేషన్ కోసం అక్నాలడ్జ్‌మెంట్ వచ్చింది. బాధితుడి ఫోన్ నంబర్‌తో తన మెయిల్ ఐడీ రిజిస్టర్ అయిన తర్వాత.. నిందితుడు ఈ-సిమ్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌కు.. ఈ-మెయిల్ ఐడీ ద్వారా రిక్వెస్ట్ పంపాడు. ‘‘సర్వీస్ ప్రొవైడర్ ఈ-సిమ్ రిక్వెస్ట్‌ను అంగీకరించిన తర్వాత.. మోసగాడు ఇచ్చిన మెయిల్ ఐడీకి ఈ-సిమ్ సర్వీస్ కోసం క్యూఆర్ కోడ్ వెళ్లింది. నిందితుడు అప్పలనాయుడికి గూగుల్ ఫామ్ పంపి.. అందులో పేరు, బ్యాంకు వివరాలు నింపాలని కోరాడు. బాధితుడి నుంచి ఆ వివరాలు అందాక.. కేటుగాడు తన ఫొన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ఈ-సిమ్‌ను యాక్టివేట్ చేసుకున్నాడు. దీంతో బాధితుడి ఫోన్లో ఉన్న సిమ్ బ్లాక్ అయ్యింది’’ అని సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. ఇదే అదనుగా అప్పలనాయుడు బ్యాంక్ ఖాతాను డిజిటల్ వ్యాలెట్లకు లింక్ చేసిన సైబర్ మోసగాడు... అతడి రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 9.2 లక్షలను మాయం చేశాడు. జులై 11-13 తేదీల మధ్య 21 ట్రాన్సాక్షన్ల ద్వారా నగదును తస్కరించాడు. ఇలాగే గచ్చిబౌలికి చెందిన కుమార్ కౌశల్ మిశ్రా ఖాతా నుంచి రూ.5.9 లక్షలు, సురేశ్ రామన్ ఖాతా నుంచి 3.7 లక్షలు, కొండపూర్‌కు చెందిన డి. శ్రీనివాస్ ఖాతా నుంచి లక్ష రూపాయలను కేటుగాళ్లు కొట్టేశారు.
By July 25, 2020 at 11:32AM
No comments