నాగశౌర్య 20 ఫస్ట్‌లుక్: కండలు తిరిగిన దేహంతో సరిగ్గా గురిపెట్టేశాడు!! అదిరిందిలే..
యంగ్ హీరో 20వ సినిమా ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ దర్శకుడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో విల్లు ఎక్కుపెట్టి సూపర్బ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య. దీంతో ఈ లుక్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి లైకులతో హోరెత్తిపోతోంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన హీరో నాగశౌర్య.. ''మనస్సు, ఆత్మ అన్నీ లక్ష్యం పైనే గురిపెట్టాయి'' అని పేర్కొన్నారు. ఒత్తైన జుత్తును ముడి వేసుకొని, ఒంటిపై పచ్చబొట్టు, కండలు తిరిగిన దేహం, చేతిలో బాణంతో చాలా సీరియస్‌గా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోందని ఈ పోస్టర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ టైటిల్ అతిత్వరలో ప్రకటించనున్నారు. Also Read: నాగశౌర్య కెరీర్‌లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తుండగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. మొన్న విడుదలైన మూవీ ప్రీ లుక్, నేడు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
By July 27, 2020 at 10:05AM
No comments