ఇంటర్ బాలిక మధులికపై దాడి కేసు.. ప్రేమోన్మాదికి 15ఏళ్ల కారాగారం
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని మధులికపై ప్రేమోన్మాది దాడి కేసులో న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చింది. నిందితుడు భరత్‌కు నాంపల్లిలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు పదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా, ఆయుధ చట్టం కింద ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. హైదరాబాద్‌లోని బర్కత్‌పుర సత్యానగర్‌లో నివాసముండే కె.రాములు, ఉదయ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె మధులిక (17) శివంరోడ్డులోని శరత్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా అదే బస్తీకి చెందిన ఉంటున్న వేణు, కల్యాణిల కుమారుడు చిట్టూరి భరత్ (19) ప్రేమ పేరుతో వెంటపడి వేధించేవాడు. Also Read: తనకి ఇష్టం లేదని మధులిక ఎన్నిసార్లు చెప్పిన భరత్‌లో మార్పు రాలేదు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భరత్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినా అతడిలో మార్పు రాలేదు. తనపై పోలీసుకుల ఫిర్యాదు చేసిందన్న కక్ష పెంచుకున్న భరత్ గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో విచక్షణా రహితంగా దాడిచేశాడు. మలక్‌పేటలోని యశోదా హాస్పిటల్‌లో కొద్దిరోజుల పాటు చికిత్స పొందిన మధులిక చివరికి కోలుకుని ఇంటికి చేరుకుంది. Also Read: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ కేసును కాచిగూడ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భరత్ అరెస్ట్ చేసి అన్ని ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించి సరైన సాక్ష్యాలు సమర్పించడంతో న్యాయస్థానం భరత్‌ను దోషిగా నిర్ధారించింది. నిందితుడికి సరైన శిక్ష పడేలా చేసిన కాచిగూడ పోలీసులను సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. Also Read:
By July 14, 2020 at 11:07AM
No comments