గజదొంగలకే షాకిచ్చేలా.. బ్యాంకులో రూ.10లక్షలు కొట్టేసిన పదేళ్ల కుర్రాడు
పదేళ్ల పిల్లాడంటే స్కూల్‌కి వెళ్తాడు. ఖాళీ సమయాల్లో ఫ్రెండ్స్ ఆడుకుంటాడు అనుకుంటారు. కానీ ఆ కుర్రాడు మాత్రం గజదొంగలకే సవాలు విసిరే పనిచేశాడు. అవును అర నిమిషంలో బ్యాంకులో రూ.10లక్షలు కొట్టేసి దర్జాగా వెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నీముచ్ జిల్లాలోని జవాడ్ ప్రాంతంలో ఉన్న కార్పొరేటివ్ బ్యాంకులోకి మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఓ యువకుడితో పాటు పదేళ్ల బాలుడు బ్యాంకుకు వచ్చాడు. ఆ సమయంలో కస్టమర్లతో బ్యాంకు సందడిగా ఉంది. Also Read: నగదు తీసుకునేందుకు కొందరు, డిపాజిట్ చేసేందుకు మరికొందరు క్యాష్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడి ఉన్నారు. అదే సమయంలో క్యాషియర్ తన సీటులో నుంచి లేచి బయటకు వెళ్లాడు. అదే అదనుగా భావించిన పదేళ్ల బాలుడు ఆ క్యాబిన్‌లోకి వెళ్లి రూ.500ల నోట్ల కట్టలు అందినకాడికి దోచుకుని తన వద్దనున్న బ్యాగులో వేసుకున్నాడు. ఈ తతంగమంతా కేవలం 30 సెకన్లలోనే జరిగిపోయింది. బ్యాంకు సిబ్బంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో బాలుడిని గమనించలేదు. తానొచ్చిన పని పూర్తికావడంతో యువకుడు, బాలుడు బ్యాంకు నుంచి బయటకు వెళ్తుండగా డబ్బు చోరీకి గురైనట్లు గమనించిన క్యాషియర్ అలారమ్ మోగించాడు. Also Read: దీంతో కంగారుపడిన నిందితులిద్దరూ బయటకు వెళ్లిపోయి చెరో దిక్కుకూ పరుగెత్తారు. సీసీ కెమెరా పుటేజీలో బాలుడు చాకచక్యంగా డబ్బు కట్టలు తీసుకుని బ్యాగులో వేసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జవద్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై బ్యాంకు సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డులు, ఆ సమయంలో బ్యాంకులో ఉన్న కస్టమర్లను పోలీసులు విచారించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read: Also Read:
By July 16, 2020 at 08:15AM
No comments