Breaking News

HBD Gopichand: గోపీచంద్ బర్త్ డే గిఫ్ట్.. 'సీటీమార్' నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్


నేడు (జూన్ 12) మ్యాచో స్టార్ పుట్టినరోజు. 1979 సంవత్సరంలో సరిగ్గా ఇదేరోజు జన్మించిన ఈ హీరో నేటితో 41 యేళ్లు పూర్తిచేసుకొని 42వ యేట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన లేటెస్ట్ మూవీ 'సిటీమార్' నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసిన 'సిటీమార్' యూనిట్.. గోపీచంద్ బర్త్ డే సందర్భంగా తాజాగా మరో విడుదల చేసి ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంది. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ 'సిటీమార్' చిత్రంలో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా, మిల్కీబ్యూటి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈమెతో పాటు మరో హీరోయిన్ దిగంగన సూర్యవంశీ కూడా నటిస్తుండటం చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశం. ఇంకా ఈ చిత్రంలో తరుణ్ అరోర, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. Also Read: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ ఫినిష్ చేసిన దర్శకనిర్మాతలు లాక్‌డౌన్ కారణంగా ఈ షూటింగ్ వాయిదా వేశారు. అయితే షూటింగ్స్ రీ ఓపెన్ అనుమతి వచ్చిన నేపథ్యంలో ఆగస్టు నెలలో మిగిలిన భాగం షూటింగ్ ఫినిష్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.


By June 12, 2020 at 11:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/gopichand-birthday-gift-new-poster-released-from-seetimaarr-movie/articleshow/76335012.cms

No comments