Breaking News

Fake Alert జమ్మూ కశ్మీర్‌ను ఐరాస ప్రత్యేక దేశంగా గుర్తించిందా? అసలు నిజం ఇదీ


ప్రచారం: ఇటీవల విడుదల చేసిన ఆసియా పటంలో జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించిందని పేర్కొంటూ శ్రీనగర్ న్యూస్ ఎక్స్‌ప్రెస్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది. అలాగే, ఈ మ్యాప్ పీడీఎఫ్ ఫైల్ www.un.orgలో ఉందంటూ అఫ్జర్ భట్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే, ఇందులో నిజం లేదని, జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఐరాస గుర్తించలేదని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. నిజంఈ పోస్ట్ ఆధారంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ పటాన్ని పరిశీలించి, వాస్తవాలను తెలుసుకుంది. ఆక్రమిత కశ్మీర్, భారత కశ్మీర్లను విభజించే నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ను సూచించడానికి మ్యాప్‌లో చుక్కల రేఖను ఉపయోగించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత, పాకిస్థాన్‌కు మధ్య ప్రాంతంగా సూచించారు. వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ: ఏది ఏమైనప్పటికీ, మ్యాప్‌లో చూపిన సరిహద్దులు, పేర్లు, ఉపయోగించిన హోదాలు యుఎన్ అధికారిక ఆమోదం లేదా అంగీకారాన్ని సూచించవని ఐరాస హెచ్చరిచ్చింది. మ్యాప్‌లో డాటెడ్ రేఖ జమ్మూ కశ్మీర్‌లో భారత్, పాకిస్థాన్ అంగీకరించిన నియంత్రణ రేఖను సూచిస్తుంది. కశ్మీర్ విషయంలో ఇరు దేశాలు తుది అంగీకారానికి రాలేదని పేర్కొంది. వర్డిక్ట్కాబట్టి జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ బృందం ధ్రువీకరించింది.


By June 27, 2020 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/un-recognized-jammu-kashmir-as-separate-country-the-claim-is-false/articleshow/76657265.cms

No comments