Breaking News

సచివాలయ ఉద్యోగినికి ప్రేమ వేధింపులు.. సజీవ దహనం చేస్తానంటూ బెదిరింపు


సచివాలయ ఉద్యోగినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించిన ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి గ్రామంలో చోటుచేసుకుంది. అరఢకోట గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న యువతిని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. గురువారం ఏకంగా ఆమె ఆఫీసుకే వెళ్లి బయటకు రావాలంటూ డిమాండ్ చేశాడు. తన ప్రేమను అంగీకరించకపోతే పెట్రోల్ పోసి దహనం చేస్తానని, ఎవరొచ్చి కాపాడతారో చూస్తానని బెదిరించాడు. Also Read: తాను విధుల్లో ఉన్నానని, ఇక్కడికొచ్చి గొడవ చేయడం మంచిది కాదని ఆమె చెప్పినా వినకుండా చేయి చేసుకున్నాడు. దీంతో మిగతా సిబ్బంది ప్రశాంత్‌ను అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనతో భయపడిపోయిన యువతి వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారమిచ్చింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని కూతురిని ఇంటికి తీసుకెళ్లారు. ప్రశాంత్‌ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో పూర్ణయ్యకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు, ప్రశాంత్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By June 26, 2020 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-man-booked-over-love-harassment-on-village-secretariat-womam-employee/articleshow/76636116.cms

No comments