Breaking News

‘పీవీ నరసింహారావు వల్ల బాగా లాభం పొందింది ఆమె ఒక్కరే!’


సమకాలీన రాజకీయ నాయకులు పీవీ నరసింహారావును చూసి ఎంతో నేర్చుకోవాలని సీనియర్ ఎడిటర్ దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు గతంలో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. పాత్రికేయుడైన పొత్తూరికి, పీవీ నరసింహారావుకు మధ్య 1955 నుంచి అనుబంధం ఉండేది. నాయకుడికి అధిష్ఠానం ఏదైనా శాఖ అప్పగిస్తే దాన్ని పూర్తిస్థాయిలో లోతైన అధ్యయనం చేయాలని ఆయన అంటుండేవారని పొత్తూరి ఓ చర్చావేదికలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయనకు కేటాయించిన పోర్ట్‌ఫోలియోలను క్షుణ్నంగా అధ్యయం చేయనిదే నిద్రపోయే మనస్తత్వం కాదని గుర్తు చేసుకున్నారు. ఇప్పటి మంత్రుల్లో కొందరికి తమ శాఖపై కనీస అవగాహన కూడా ఉండదని అన్నారు. 1980 నాటి ఓ సంఘటనను గుర్తు చేశారు. ‘‘అప్పుడు గువహటిలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. సభ జరుగుతుండగా దానికి దగ్గర్లోనే ఓ కుటీరంలో బండెడు పుస్తకాలు పెట్టుకొని పీవీ చదువుతున్నారు. అక్కడ సభలు జరుగుతుంటే మీరిక్కడ ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తే, ‘అక్కడ నేను చేసేదేముంది. తీర్మానం రాసిచ్చేశా. ఇప్పుడు మరో తీర్మానం కోసం ప్రిపేర్ అవుతున్నా’ అని అనేశారు. తన పనేంటో తాను నిక్కచ్చిగా చేసుకుపోయేవారు. ఇందిరా గాంధీ కూడా పీవీని ఎంతగానో నమ్మేవారు. రిజల్యూషన్‌లు ఇచ్చే బాధ్యతను పీవీకే అప్పగించేవారు. పీవీ వల్ల ఇందిరా గాంధీ బాగా లాభం పొందారు.’’ అని గుర్తు చేశారు. నిజానికి ఇందిరాగాంధీతో పీవీకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1977లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు పీవీ ఇందిరకే మద్దతు పలికారు. పీవీని ఎంతగానో నమ్మేవారు. ఆ నమ్మకంతోనే ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని సైతం ఇచ్చారు. ప్రభుత్వంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరులు వంటి కీలక మంత్రి పదవులను ఇచ్చారు. ఒకరకంగా ఇందిరకు ప్రధాన సలహాదారు పాత్ర పోషించేవారని అప్పటి నాయకులు చెబుతుంటారు. 1984 ప్రాంతంలో ఎన్టీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో పదవి నుంచి దింపే ఇందిర ప్రయత్నాన్ని కూడా పీవీ వ్యతిరేకించారు. గుండె ఆపరేషన్ కోసం ఆయన విదేశాలకు వెళ్లగా.. ఇక్కడ గందరగోళం చేయడం సరికాదని చెప్పి నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చారు. ఆయన చెప్పినట్లుగానే తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమిపాలైంది. రాజీవ్‌గాంధీ కూడా ఇందిర వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. పార్టీల పరంగా ఎంత వైరం ఉన్నా, విలువల పరంగా నైతికతకు కట్టుబడ్డ వ్యక్తి ఆయన. ప్రధాని ఇందిర కేబినెట్‌లో హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఆమె హత్య జరిగింది. Must Read: Must Read:


By June 28, 2020 at 06:57AM


Read More https://telugu.samayam.com/telangana/news/intimate-relationships-between-indira-gandhi-and-pv-narasimha-rao-says-senior-journalist/articleshow/76668739.cms

No comments