తెలంగాణలో దారుణం... పిల్లల్ని చెరువులో తోసేసిన కసాయితల్లి

భార్యభర్తల మధ్య గొడవ పసివాళ్ల ప్రాణం తీసింంది. భర్తపై కోపంతో ఇద్దరు చిన్నారులు బలి అయిన దారుణ సంఘటన సూర్యపేటలో చోటు చేసుకొంది. సూర్యపేట విద్యానగర్‌లో నివాసముంటున్న ప్రశాంత్‌కుమార్, నాగమణి ఆదివారం రాత్రి గొడవ పడ్డారు. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిన భార్య నాగమణి సమీపంలోని సద్దల చెరువులో కొడుకు హర్షవర్ధన్, కుమార్తె జ్యోతిమాధవిని పడేసింది. సోమవారం ఉదయం చెరువు వద్ద నాగమణిని గమనించిన స్థానికులు విషయాన్ని ఆరా తీయగా ఇద్దరు బిడ్డలను చెరువులో పడేసిట్లు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో కుమారుడు హర్షవర్ధన్ మృతదేహం లభ్యం కాగా కూతురు జ్యోతిమాధవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ సంఘటన చేరుకుని మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
By June 15, 2020 at 09:00AM
No comments