Breaking News

ప్రియుడి కోసం భర్తను చంపేసి.. కూతురు ఇచ్చిన ట్విస్ట్‌‌తో అడ్డంగా బుక్కైంది


తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వి.వి.మెరకలో ఇటీవల జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో ప్రియుడితో కలసి భార్యే హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమలాపురం డీఎస్పీ మాసూమ్‌బాషా సోమవారం రాజోలు పోలీస్‌‌స్టేషన్‌లో వెల్లడించారు. వీవీమెరక ప్రగతినగర్‌కు చెందిన ఉప్పు ప్రసాద్‌(48) ఈ నెల 2న మృతి చెందాడు. కేసువదాసుపాలేనికి చెందిన రౌడీషీటర్‌ చొప్పల సుభాకర్‌ అలియాస్‌ శివ, తల్లి ఉప్పు ప్రశాంతి కలసి తన తండ్రిని హత్య చేసినట్లు మృతుని కుమార్తె ఈ నెల 24న సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యగా తేల్చారు. ఉప్పు ప్రసాద్‌ తన ఇంటి వద్దనే సోడా దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య ప్రశాంతికి రౌడీషీటర్‌ చొప్పల సుభాకర్‌ అలియాస్‌ శివ‌తో చాలాకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది.

భర్త లేని సమయంలో ఆమె ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ పద్ధతి మార్చుకోవాలని భార్యను అనేక సార్లు హెచ్చరించాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ సుఖానికి అడ్డు పడుతున్న ప్రసాద్‌ను చంపేయాలని జ్యోతి, శివ నిర్ణయించుకున్నారు. తమకు మధ్యవర్తిగా వ్యవహరించే యడ్ల ప్రమీలా రాణి అనే మహిళ సాయంతో శివ నిద్రమాత్రలు ప్రియురాలికి పంపించేవాడు. వాటిని ప్రశాంతి భర్త తినే ఆహారంలో కలిపేది. దీంతో కొద్దిరోజులకు ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యాడు.

Also Read:

వైద్యం కోసం వచ్చిన యువతిపై డాక్టర్ అఘాయిత్యం... ఏలూరులో దారుణం

ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో తనకు అలసటగా ఉందని సోడా కావాలని ప్రశాంతి భర్తను కోరింది. దీంతో ప్రసాద్ తన దుకాణంలోకి వెళ్లగా అప్పటికే అక్కడ తన అనుచరులు వెంకటనరసింహారావు, జిల్లెళ్ల ప్రసాద్‌‌తో కలిసి మాటు వేసిన శివ ప్రియురాలి భర్త మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కుర్చిలో కుర్చోపెట్టి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత ప్రశాంతి దుకాణానికి వచ్చి హడావుడి చేసింది. కుమార్తె, స్థానికుల సాయంతో భర్తను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు సహజ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read:

అక్రమ సంబంధంపై వెరైటీ తీర్పు.. పోలీసుల ఎంట్రీతో బుక్కైన గ్రామ పెద్దలు

భర్త చనిపోవడంతో కుంగిపోయినట్లు కొద్దిరోజులు నటించిన ప్రశాంతి తర్వాత ప్రియుడితో వ్యవహారం మళ్లీ మొదలుపెట్టింది. ఓ రోజు శివతో ఫోన్లో సరదాగా మాట్లాడుతుండగా కుమార్తె చాటుగా వింది. ప్రసాద్‌ను హత్య చేసిన విషయం గురించి వారు మాట్లాడటాన్ని విని షాకైంది. తన తండ్రి తల్లే ప్రియుడితో కలిసి చంపేసిందని నిర్ధారించుకుని వెంటనే సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రశాంతి, శివను అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరూ నేరం అంగీకరించారు. వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులురాలు ప్రమీలారాణి కోసం గాలిస్తున్నారు.

Also Read:

రూ.5లక్షల నగదు సహా ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. సిద్దిపేటలో కలకలం



By June 30, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-help-of-lover-in-east-godavari-district-arrested/articleshow/76702182.cms

No comments