Breaking News

కారుణ్య ఉద్యోగం తండ్రిని చంపేసిన కొడుకు.. తెలంగాణలో దారుణం


తెలంగాణలోని జిల్లాలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. మరికొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న తండ్రిని కుటుంబ సభ్యుల సహకారంతో కన్న కొడుకే హత్య చేశాడు. అనంతరం ఆయన గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. చివరి నిమిషంలో పోలీసుల ఎంట్రీతో ఆ దుర్మార్గుడి బండారం బయటపడింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో గత నెల 26న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. Also Read: కొత్తూరు గ్రామానికి చెందిన ముత్కల నర్సయ్య(58) గోదావరిఖనిలో సింగరేణి సంస్థలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య తార, ఇద్దరు కుమారులు తిరుపతి(35), రాకేష్‌(32) ఉన్నారు. అనారోగ్య కారణం చూపుతూ(మెడికల్‌ అన్‌ఫిట్‌)గతంలో ఒకసారి తన ఉద్యోగాన్ని పెద్ద కుమారుడికి ఇప్పించేందుకు నర్సయ్య ప్రయత్నించి విఫలమయ్యాడు. తండ్రి ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్న తిరుపతి ఆయన పదవీ విరమణ వయసు దగ్గర పడుతుంటంతో ఆందోళన చెందాడు. ఉద్యోగంలో ఉండగానే తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం తనకే వస్తుందని, దాంతో హాయిగా ఉండొచ్చని తల్లి, తమ్ముడిని నమ్మించాడు. ప్లాన్ ప్రకారం మే 23న తల్లిని, తమ్ముడిని గోదావరిఖనికి పంపించాడు. 25న రాత్రి గ్రామంలో జరిగిన ఓ విందులో మద్యం తాగొచ్చి ఇంట్లో నిద్రపోతున్న తండ్రిని తిరుపతి గొంతునులిమి చంపేశాడు. Also Read: అనంతరం ఏమీ ఎరుగనట్లుగా అదే గ్రామంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్లి తండ్రి గుండెపోటుతో చనిపోయాడంటూ నాటకమాడాడు. బంధువులకు సమాచారమిచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. అయితే తండ్రి ఉద్యోగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఎఫ్‌ఐఆర్‌ అవసరం కావడంతో 27వ తేదీన తిరుపతి.. ధర్మారం పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతిగా మద్యం తాగడం, నిద్రలోనే గుండెపోటు రావడంతో తన తండ్రి మరణించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఎస్సై ప్రేమ్‌కుమార్‌ విచారణ నిమిత్తం గ్రామానికి చేరుకుని చితిపై ఉన్న నర్సయ్య మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానంతో పోస్టుమార్టం చేయించగా.. గొంతు నులమడం వల్లనే నర్సయ్య మృతిచెందినట్లు నివేదికలో తేలింది. దీంతో తిరుపతిని అదుపులోకి తీసుకుని విచారంగా.. కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తండ్రిని హతమార్చినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు తిరుపతితో పాటు అతడి తమ్ముడు రాకేష్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మృతుడి భార్య తార కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By June 07, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-father-in-telangana-with-help-of-mother-and-brother/articleshow/76241474.cms

No comments