తెలంగాణా మద్యం కేసులో ఇరుక్కున్న టాలీవుడ్ డైరెక్టర్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం బోడపాలెంలో దొరికిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన మద్యం సీసాల కేసులో తెలుగు సినీ దర్శకుడి పాత్ర వెలుగులోకి వచ్చింది. ఆ మద్యం సీసాలను తెలంగాణ నుంచి తీసుకొచ్చింది సినీ డైరెక్టర్‌గా దొరబాబుగా తేలినట్లు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) నర్సీపట్నం సీఐ సంతోష్ తెలిపారు. నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెం గ్రామానికి చెందిన దొరబాబు గతంలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించినట్లు సీఐ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. Also Read: బోడపాలెంలో 85 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న తాము జోగునాయుడు, సతీష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? సినీ దర్శకుడు మరెరికైనా మద్యం సరఫరా చేశాడా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన సతీష్ జోగునాథునిపాలెం గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్ వి.శ్రీనివాసరావుకు స్నేహితుడు. దీంతో పోలీసులు ఆయన ఇంట్లోనూ తనిఖీలు చేయగా ఏపీకి చెందిన 8 మద్యం సీసాలు దొరికాయి. నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలోనూ పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో 8 తెలంగాణ మద్యం సీసాలు, 6 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 26, 2020 at 07:46AM
No comments