చిచ్చురేపిన అక్రమ సంబంధం.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త


పచ్చటి సంసారంలో చెలరేగిన అనుమానపు చిచ్చు రెండు నిండు జీవితాలను బలితీసుకున్న ఘటన జిల్లాలో వెలుగుచూసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెకు చంపేసిన తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణవనం మండలం నాగిలేరు గిరిజన కాలనీకి చెందిన శీను(35)కు, అదే గ్రామానికి చెందిన జ్యోతి(25)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అరుణ్‌కుమార్(5), ప్రవీణ్‌కుమార్(2) ఉన్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై శీను అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగట్టి నిత్యం వేధిస్తున్నాడు. Also Read: ఈ క్రమంలోనే శనివారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆదివారం ఉదయం కూతురిని ఉపాధిహామీ పనులకు తీసుకెళ్లేందుకు జ్యోతి తండ్రి వారింటికి వచ్చాడు. మంచంపై విగతజీవిగా ఉన్న ఆమెను చూసి గట్టిగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు గుమిగూడి జ్యోతిని పరిశీలించగా అప్పటికే చనిపోయింది. జ్యోతి గొంతు కింద గాయాలు ఉండటం, శీను ఇంట్లో లేకపోవడంతో అతడే భార్యను చంపి పరారైనట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శీను కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతంలో విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. శీను క్షణికావేశం వల్ల రెండు ప్రాణాలు పోవడమే కాకుండా ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. Also Read:
By June 29, 2020 at 07:31AM
No comments