బంధువుతో అఫైర్.. భర్త హత్యకు రెండుసార్లు స్కెచ్.. చిత్తూరులో దారుణం
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించిందో ఇల్లాలు. జిల్లా రూరల్ మండలం దుర్గసముద్రం పంచాయతీ వడ్డిపల్లికి చెందిన బత్తల శివయ్యకు సుజాత అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల సమీప బంధువు లక్ష్మయ్యతో సుజాత అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ వస్తోంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న శివయ్య పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని సుజాత ప్లాన్ వేసింది. ప్రియుడు లక్ష్మయ్యను రెచ్చగొట్టడంతో మార్చి 21న అతడు శివయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకున్నాడు. దీంతో మే నెల 23న శివయ్యపై కొందరు కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. Also Read: ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత బాధితుడు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా శివయ్యపై అతడి భార్య, ప్రియుడు లక్ష్మయ్య హత్యాయత్నం చేసినట్లు తేలడంతో అందరూ షాకయ్యారు. దీంతో పోలీసులు మంగళవారం లక్ష్మయ్యతో పాటు నవీన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. శివయ్య భార్య సుజాత పరారీలో ఉందని, ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. Also Read:
By June 04, 2020 at 10:16AM
No comments