నవ వధువుకు కరోనా... ఆగిన పెళ్లి
ప్రజల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది. మూడు నెలల పాటు కేంద్రం విధించిన లాక్ డౌన్‌తో దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయారు. జరగాల్సిన పెళ్లిళ్లు, పంక్షన్లు, శుభకార్యాలన్నీ వాయిదా పడ్డాయి. చాలావరకు ప్రజలు అన్నిరకాల వేడుకల్ని రద్దు చేసుకున్నారు. మరికొందరు అతి తక్కువ మందితో ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు నిర్వహించుకున్నారు. అయితే కరోనా కరాణంగా మరికొన్ని గంట్లలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఈ నెల 1న యువకుడు, యువతికి పెద్దలు ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో ఉన్న వధువు వివాహం నిమిత్తం మరో ఐదుగురితో కలిసి గత నెల 29వ తేదీన తమిళనాడులోని కోవై జిల్లా పొల్లాచ్చికి దగ్గరలో ఉన్న వడగపాళయం గ్రామానికి చేరుకుంది. దీంతో ఆమె సహా అందరికీ నిబంధనల ప్రకారం అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, వధువుకు అప్పటికే కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. దీంతో వివాహాన్ని వాయిదా వేశారు పెద్దలు. ప్రస్తుతానికి పెళ్లిని ఆపివేశామని పెద్దలు తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 9304 కొత్త కేసులు నమోదు కాగా.. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు రెండు స్థానంలో ఉంది.
By June 04, 2020 at 10:12AM
No comments