తెనాలి: తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు.. కారణం తెలిసి పోలీసులు షాక్
తెనాలిలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన వ్యక్తి.. తాగడానికి డబ్బు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని కిరాతకంగా చంపాడో కొడుకు. గంగానమ్మపేటకు చెందిన శశీదేవి భర్త చనిపోవడంతో కుమారుడు లక్ష్మీనారాయణతో ఉంటోంది. అతడికి భార్య, నలుగురు పిల్లలు. పనసకాయల వ్యాపారం చేసే లక్ష్మీనారాయణ మద్యానికి బానిసయ్యాడు.. కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోవడం లేదు. అతడి తల్లి తోపుడు బండిపై ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ కొడుకు కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. లక్ష్మీనారాయణ శుక్రవారం వ్యాపారానికి వెళ్లలేదు.. తన దగ్గరున్న డబ్బుతో మద్యం తాగేశాడు. మళ్లీ మద్యం తాగడానికి చేతిలో డబ్బుల్లేవు.. డబ్బు కావాలని తల్లిని అడగ్గా ఆమె లేవని సమాధానం చెప్పింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న లక్ష్మీనారాయణ తల్లిపై పనసకాయలు కోసే కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో పొడిచి పారిపోయాడు. ఆమె ప్రాణ భయంతో పెద్దగా కేకలు వేస్తూ నేరుగా పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీసింది. ఆమె కోడలు కూడా వెంట వెళ్లింది. వృద్దురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ గాయం నుంచి తీవ్ర రక్తశ్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం గాలిస్తున్నారు. మద్యానికి బానిసై కన్నతల్లినే కిరాతకంగా చంపాడు.
By June 06, 2020 at 07:49AM
No comments