Breaking News

ఎన్టీఆర్ చాలా మారిపోయాడు.. అతన్ని చూస్తుంటే: తారక రాముడిపై శ్రీయ కామెంట్స్


ఒకానొక సమయంలో దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ . వెండితెరపై టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని అందరు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. భర్తతో తెగ షికార్లు కొడుతూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్‌లోనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన శ్రీయ.. తనతో నటించిన హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. త‌ను ప‌నిచేసిన హీరోల్లో కొంతమంది గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను చెప్పి ఆకట్టుకుంది శ్రీయ శరన్. పవన్ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్‌ మంచి కో స్టార్‌ అని, ఆయనొక పుస్త‌కాల పురుగు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తారక రాముడు గురించి స్పందిస్తూ నందమూరి అభిమానులకు కిక్కిచ్చింది. ఒకప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని, ఇప్పుడు మాత్రం చాలా మారిపోయాడని శ్రీయ చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్‌ను చూస్తుంటే ముచ్చ‌టేస్తుందని చెప్పి ఆయన ఫ్యాన్స్‌ని హుషారెత్తించింది శ్రీయ. Also Read: ఇకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్టు (రౌద్రం రణం రుధిరం) మూవీలో తానూ భాగం కానున్నానని ఇటీవలే శ్రీయ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన తాను కనిపించనున్నానని ప్రకటిస్తూ సీక్రెట్ రివీల్ చేసింది. దీంతో శ్రీయ అందాలను మరోసారి వెండితెరపై చూడాలని కుతూహల పడుతున్నారు మెగా, నందమూరి అభిమానులు.


By June 09, 2020 at 08:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shriya-saran-intresting-comments-on-ntr-and-pawan-kalyan/articleshow/76274267.cms

No comments