Breaking News

బావిలో దూకిన మహిళా సర్వేయర్.. చిత్తూరులో విషాదం.. ప్రేమ వ్యవహారమే.!


గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. సదుం మండలం బూరగమంద సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య(21) సూసైడ్ చేసుకుంది. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఉద్యోగంలో చేరి ఏడాది కూడా గడవకుండానే ఆమె సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలచివేసింది. అయితే లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో ఒక యువకుడితో సన్నిహితంగా ఉండేదని చెబుతున్నారు. అతనితో విభేదాలు రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. Also Read:


By June 20, 2020 at 02:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/grama-sachivalayam-woman-employee-suicide-in-chittoor/articleshow/76479692.cms

No comments