గర్భంతో ఉన్న భార్యను చంపి పొలంలో పాతిపెట్టిన భర్త.. కర్నూలులో దారుణం
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి గర్భవతి అని కూడా చూడకుండా కిరాతకంగా చంపి పొలంలో పాతిపెట్టిన ఘటన జిల్లాలో విషాదం నింపింది. ఈ ఘటన హొళగుంద మండలం సమ్మతగేరి మజరా గ్రామం మూగుమానుగుందిలో జరిగింది. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చెందిన భీమన్న కుమార్తె మీనాక్షి అలియాస్ వీణను (28) హొళగుంద మండలం సమ్మతగేరి మజరా మూగుమానుగుంది గ్రామానికి చెందిన గిరిమల్లప్ప కుమారుడు బసవరాజుకు ఇచ్చి పదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి కుమారుడు శశికుమార్ (5) ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న బసవరాజు కొంతకాలంగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. Also Read: దీనిపై గతంలో రెండు మూడుసార్లు పెద్దలు పంచాయతీ పెట్టి దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు. అయినప్పటికీ బసవరాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. దీనికి తోడు అత్తమామలు గిరిమల్లప్ప, రత్నమ్మలు కూడా మీనాక్షిని చిత్రహింసలు పెట్టేవారు. నాలుగు వారాల కిందట భార్యను చంపేసిన బసవరావు తన పొలంలోనే పాతిపెట్టాడు. 15వ తేదీన బసవరాజు తన ఐదేళ్ల కుమారుడితో కలిసి తన అత్తమామలకు ఫోన్ చేశాడు. అమ్మకు ఫోన్ ఇవ్వాలని.. తాను మాట్లాడుతానని మనవడు కోరగా... ‘మీ అమ్మ ఇక్కడికి రాలేదని’ అమ్మమ్మ, తాత సమాధానమిచ్చారు. Also Read: అనంతరం అల్లుడిపై అనుమానం వచ్చిన మీనాక్షి తల్లిదండ్రులు ఈ నెల 17న హొళగుంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ విజయ్‌కుమార్ బసవరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. భార్యపై అనుమానంతో తానే చంపి పొలంలో పాతిపెట్టినట్లు అంగీకరించాడు. దీంతో సోమవారం శవాన్ని వెలికితీసిన పోలీసులు డాక్టర్ల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించారు. Also Read:
By June 30, 2020 at 10:14AM
No comments