Breaking News

నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.. ఆ రెండు అంశాలపై మరింత స్పష్టత!


నేటి సాయంత్రం మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ మొదలైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకూ ఐదుసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకుంది. ఇప్పటికే కట్టడికి కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి మార్గదర్శకాలు విడుదల చేసింది. మరోవైపు.. చైనా సరిహద్దులో నెలకున్న ఉద్రిక్తత తారాస్థాయికి చేరిన వేళ.. ఇరుదేశాలూ భారీగా బలగాలను మోహరించాయి. ఇదే సమయంలో చైనాకు చెందిన 59 యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సోమవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఆసక్తి నెలకొంది. అన్‌లాక్ 2.0పై కూడా ప్రధాని ప్రసంగంతో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించింది. మంగళవారం నాటితో అన్‌లాక్‌-1.0 ముగుస్తుండడంతో జులై 1 నుంచి అన్‌లాక్‌-2.0 మొదలుకానుంది. దీనిలో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో జులై 31 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, నిషేధించిన కొన్ని కార్యకలాపాలు మినహా మిగతావన్నీ వాటి వెలుపల నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేసింది.


By June 30, 2020 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/unlock-pm-narendra-modi-to-address-nation-at-4pm-today/articleshow/76702931.cms

No comments