Breaking News

గూఢచర్యంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పాక్ దౌత్య సిబ్బంది.. భారత్ నుంచి బహిష్కరణ


దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పాక్ హైకమిషన్ సిబ్బందిని ఆర్మీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీలక సమాచారాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సిబ్బందిని ఢిల్లీలోని పాక్ హైకమీషన్ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. హైకమిషన్ ఆఫీసులో విధులు నిర్వహిస్తోన్న అబిద్ హుస్సేన్, తహీర్ ఖాన్‌తోపాటు జావేద్ హుస్సేన్‌ల అనే కు పాక్ గూఢచారి సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. వారిని సోమవారం ఉదయమే దేశం విడిచివెళ్లాలని హుకుం జారీచేశారు. చివరిసారిగా పాక్ దౌత్య సిబ్బందిని 2016లో భారత్ నుంచి బహిష్కరించారు. తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. ‘దౌత్య మిషన్ సభ్యులుగా చట్ట విరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ అధికారులను వ్యక్తిగతంగా 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళమని ప్రభుత్వం కోరింది’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత జాతీయ భద్రతకు వ్యతిరేకంగా ఈ అధికారుల కార్యకలాపాలకు సంబంధించి పాక్ ప్రభుత్వానికి తీవ్ర నిరసనను తెలిపింది. దౌత్య మిషన్‌లోని ఏ ఒక్క సభ్యుడు భారత్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనకూడదని, దౌత్య హోదాకు విరుద్ధంగా వ్యవహరించకూడదని కోరింది. అయితే, భారత్ వాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. తమ దౌత్య సిబ్బంది ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని, అవన్నీ నిరాధారమైనవని వ్యాఖ్యానించింది. అంతేకాదు, తప్పుడు ఆరోపణలతో తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించి, వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని పాక్ విమర్శలు గుప్పించింది. Read Also: పాక్ విదేశాంగ శాఖ మరో అడుగు ముందుకేసి తమ సిబ్బందిని భారత్ హింసించింద, దౌత్యవేత్తలను నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. జమ్మూ కశ్మీర్‌లో దిగజారుతున్న పరిస్థితి, మానవ హక్కుల ఉల్లంఘనలు, బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి ఈ తమపై ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పాక్ పేర్కొంది. ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని.. దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరత సాధనకు ప్రయత్నించాలని కోరింది. ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని ఆర్య సమాజ్ రోడ్ సమీపంలో రక్షణ సిబ్బందిని కలవడానికి ప్రయత్నించిన ముగ్గురు పాకిస్థానీయులను పోలీసులు గుర్తించారని అధికార వర్గాలు తెలిపాయి. అబిద్ హుస్సేన్ (42), తాహిర్ ఖాన్ (44) నకిలీ భారతీయ పేర్లు, గుర్తింపు కార్డులను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. జావేద్ హుస్సేన్ కారులో నగరం చుట్టూ తిరిగారు. గూఢచర్యం కార్యకలాపాల్లో భాగంగా కొంతమంది రక్షణ సిబ్బందిని సంప్రదించి వారిని ఆకర్షించడానికి ప్రయత్నించడంతో వారి కదలికలపై ఐబీ నిఘా వేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. Read Also: వారి వద్ద కొన్ని కీలక పత్రాలతో పాటు రూ .15 వేల నగదు,రెండు ఐఫోన్‌ల స్వాధీనం చేసుకున్నారు.. విచారణ సమయంలో తాము దౌత్య విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నా... సైన్యం గురించి సున్నితమైన సమాచారం అందిస్తున్న అనేక మంది వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. వీరికి సమాచారం చేరవేసే వారి గురించి ఆరా తీస్తున్నారు. గూఢచర్యం రాకెట్‌లో హైకమిషన్‌కు చెందిన ఇతర సిబ్బందికి ఇందులో హస్తం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. విచారణకు సంబంధించిన నివేదికను విదేశాంగ శాఖకు పంపిన అధికారులు... అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు, వైద్య పరీక్షల నిర్వహించి, ఆపై హైకమిషన్‌కు అప్పగించారు. ఇక, అబిద్ హుస్సేన్‌ను డిసెంబర్ 2018 నుంచి హైకమిషన్‌లో వీసా అసిస్టెంట్‌గా, తాహిర్ ఖాన్ అప్పర్ డివిజన్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తూ అదే సమయంలో భారతదేశానికి వచ్చారు. జావేద్ హుస్సేన్ గత ఐదున్నరేళ్లుగా పనిచేస్తున్నాడు. Read Also: భారత్-పాక్ సరిహద్దులో సైన్యం గురించి కీలక సమాచారం సేకరిస్తున్న మెహమూద్ అక్తర్ అనే వ్యక్తిని 2016లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ హైకమిషన్‌లోని అనేక మంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. హైకమిషన్‌లోని 16 మంది సిబ్బంది వివిధ మార్గాల ద్వారా సైనిక రహస్యాలను పొదుతున్నట్లు తేలడంతో వారిని బహిష్కరించారు. ఆ తరువాత, తన పొరుగు దేశాలైన మారిషస్, శ్రీలంకలలో పాకిస్తాన్ మిషన్‌లలోని సిబ్బందిని కూడా భారత్‌లో గూఢచర్యానికి వినియోగిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.


By June 01, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-of-pakistan-diplomat-mission-staffers-caught-spying-2-of-them-expelled/articleshow/76128592.cms

No comments