Breaking News

అంతకంటే పెద్ద బూతు మరొకటి లేదు.. టాలీవుడ్ గొడవలపై వర్మ సంచలన వ్యాఖ్యలు


టాలీవుడ్‌లో నిత్యం ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో లుకలుకలు అంశం హాట్ టాపిక్ కాగా.. ఇటీవల బాలకృష్ణ- చిరంజీవి ఇష్యూ ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూములు పంచుకుంటున్నారా? అని బాలయ్య అనడం, దానిపై నాగబాబు ఘాటుగా రియాక్ట్ కావడంతో ఈ ఇష్యూ ముదిరింది. ఈ క్రమంలో టాలీవుడ్ గొడవలపై తనదైన కోణంలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు . చిత్రసీమలో అంతా ఎవడికి వాడే అంటూ.. ఇక్కడంతా లోపల ఒకలా ఉంటూ బయటకు మరోలా కనిపిస్తారని చెప్పుకొచ్చారు వర్మ. అందరూ ఒకటి అనేకంటే కూడా పెద్ద బూతు మరొకటి లేనేలేదంటూ సంచలన కామెంట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వరినీ పట్టించుకోరని ఆయన చెప్పారు. సక్సెస్ అయితే ఆకాశానికెత్తడం, ఒకవేళ ఎవ్వరైనా ఫెయిల్ అయ్యారంటే వారిపై జోకులేసుకోవడం ఇక్కడ కామన్ అని ఆయన అన్నారు. ప్రస్తుతం రాజమౌళి వరస విజయాలు అందుకోవడం చూసి.. పైకి ఆహా ఓహో అంటూ పొగిడే వారే ఆయన ప్రెజెంట్ ప్రాజెక్టు ఫ్లాప్ అయితే పండగ చేసుకుంటారని కుండబద్దలు కొడుతూ మాట్లాడారు వర్మ. ఇవ్వన్నీ ఎవ్వరూ ఒప్పుకోని వాస్తవాలని పేర్కొంటూ తనదైన నైజం ప్రదర్శించి సరికొత్త చర్చలకు తెరలేపారు రామ్ గోపాల్ వర్మ. Also Read: ఇక వర్మ సినిమాల విషయానికొస్తే.. ‘క్లైమాక్స్’ రూపంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సెన్సేషనల్ మూవీ రూపొందించి ప్రేక్షకుల ముందుంచారు. అదేవిధంగా వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా మరికొద్ది రోజుల్లోనే కరోనా వైరస్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు.


By June 07, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-shocking-reaction-on-tollywood-issues/articleshow/76242661.cms

No comments