Breaking News

అల్ ఖైదా చీఫ్ అబ్దుల్ మాలిక్ హతం


ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్‌ను మట్టుబెట్టింది. ఫ్రాన్స్ దేశంలోని ఉత్తరమాలిలో ఫ్రెంచ్ సైనికదళాలు జరిపిన దాడిలో అల్ ఖైదా అధిపతి అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ హతమయ్యారు. మాలిక్ కోసం ఫ్రెంచ్, మాలి సైన్యాలు ఏడేళ్లుగా గాలిస్తున్నాయి. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో మాలిక్ తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు అప్రమత్తం అయ్యాయి. స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఈ దాడుల్లో అబ్దుల్‌ మాలిక్‌ ప్రాణాలు కోల్పోయినట్లు ఫ్రాన్స్‌ ప్రకటన విడుదల చేసింది. ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ శుక్రవారం రాత్రి ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అబ్దుల్ మాలిక్ ఇస్లామిస్ట్ పోరాటయోధుడు, ఉత్తర ఆఫ్రికా అల్ ఖైదా చీఫ్. ఉగ్రవాద నాయకుడైన అబ్దేల్‌మలెక్ ఉత్తర అల్జీరియా పర్వతాల్లో దాక్కొని ఉత్తరమాలి, నైజర్, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవాడు.


By June 06, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chief-of-al-qaeda-leader-abdelmalek-droukdel-killed-in-mali-france/articleshow/76227374.cms

No comments