Breaking News

వైరల్ అవుతున్న మాధవీలత పెళ్లి వార్తలు.. అసలు మ్యాటర్ బయటపెట్టి షాకిచ్చిన హీరోయిన్


సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై స్పందిస్తూ సంచలనం సృష్టించడం స్టైల్. హీరోయిన్ గానే కాకుండా పొలిటీషియన్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ లేడీ బ్యాచిలర్ మొన్నామధ్య దిల్ రాజు, నిఖిల్ క్వారంటైన్ పెళ్లిళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన ఫేస్‌బుక్ వేదికగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిచ్చింది. ‘‘చాలా నెలల తరవాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం మొదలైంది. మిరాకిల్ జరిగింది. నేను ఎప్పుడూ మిరాకిల్స్‌ను నమ్ముతాను. చాలా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. త్వరలోనే ప్రకటన చేస్తాను’’ అని మాధవీలత పోస్ట్‌ పెట్టడం సంచలనంగా మారింది. ఇంకేముంది ఉన్నట్టుండి మ్యాటర్ లైన్ లోకి వచ్చేసింది. ఆకట్టుకునే అందం, అందుకు తగ్గ చాతుర్యం పైగా 31 ఏళ్ల వయసు.. వీటన్నింటినీ బట్టి చూస్తే ఆమె పెట్టిన ఈ పోస్ట్ తన పెళ్లి గురించే తప్ప మరొకటి లేదంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. అంతేకాదు మాధవీలత పెళ్లి ఫిక్స్ అయిందని కొందరంటే, లేదు లేదు ఆల్రెడీ సీక్రెట్‌గా పెళ్లి కూడా అయిపోయి ఉండొచ్చు.. అందుకే ఆమె అంతలా పోస్ట్ పెట్టిందని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తానికైతే సోషల్ మీడియా అంతా మాధవీలత పెళ్లి వార్తలతో హోరెత్తిపోయింది. అయితే ఈ వార్తలపై రియాక్ట్ అయిన మాధవీ.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన పెళ్లి ఇప్పట్లో ఉండదని కుండబద్ధలు కొట్టేసింది. కంగ్రాచ్యులేషన్స్ అంటూ తన స్నేహితులు పెడుతున్న కామెంట్స్‌ చూసి పడి పడి నవ్వుకుంటున్నానని చెబుతోంది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు తప్ప ఇప్పట్లో పెళ్లి అనేదే లేదని, అన్నీ కుదిరితే 2021లో పెళ్లి చేసుకుంటానని ఆమె పేర్కొంది. అంతేకాదు మంచి అబ్బాయి ఉంటే వెతికిపెట్టండి అంటూ తనదైన కోణంలో స్పందించింది మాధవీలత. Also Read: 'నచ్చావులే' సినిమాతో అలరించిన మాధవీలత.. మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘అతిథి’ సినిమాలో అలాగే నాని హీరోగా వచ్చిన 'స్నేహితుడా' సినిమాలో నటించింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పొలిటికల్ జర్నీ ప్రారంభించి ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతోంది.


By June 06, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maadhavi-latha-reaction-on-her-marriage-news/articleshow/76228155.cms

No comments