Breaking News

ప్రేమతో చెంప మీద కొడతాడు.. వాళ్లలా కడుపు మీద కాదు: బాలయ్య బంగారు కొండ అంటోన్న నటి


నటసింహా నందమూరి 60వ ఏట అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం (జూన్ 10న) ఆయన తన షష్టిపూర్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు నందమూరి అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని మోహన్ బాబు, కె.రాఘవేంద్రరావు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్, రాజీవ్ కనకాల, శ్రీవిష్ణు, గోపీచంద్ మలినేని.. ఇలా చాలా మంది సినీ ప్రముఖులు బాలయ్యకు విషెస్ చెప్పారు. బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. Also Read: అయితే, బాలయ్యకు విషెస్ చెప్పిన వారిలో వివాదస్పద నటి కూడా ఉంది. బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఎప్పటిలానే మెగా ఫ్యామిలీని ఆడిపోసుకుంది. బాలయ్య ప్రేమతో చెంప మీద కొడతారని.. మెగా ఫ్యామిలీలా కడుపు మీద కొడ్డరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అలాగే, బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో వీడియో కూడా పోస్ట్ చేసింది. Also Read: ‘‘ఇండస్ట్రీ సింహ స్వప్నం, నటరత్న, తెలుగు ప్రియ, సామాజిక సేవ చేయడంలో గొప్ప మనసున్న వ్యక్తి.. మీకు పద్మశ్రీ అవసరం లేదు సార్. మీ నవ్వే ఒక పెద్ద అవార్డు. లివింగ్ లెజండరీ యాక్టర్ బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ప్రేమతో చెంప మీద కొడతావ్ తప్ప, మెగా ఫ్యామిలీలా కడుపు మీద కొట్టడు ఈ బంగారు కొండ. పేద ప్రజల ఆకలి, ఆరోగ్యం గురించి ఆలోచించే ముద్దుల మావయ్య మా బాలయ్య’’ అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది శ్రీరెడ్డి. బాలయ్యపై శ్రీరెడ్డి ఈ విధంగా ప్రశంసలు కురిపించడంతో నందమూరి అభిమానులు ఆమెకు కామెంట్ల ద్వారా థ్యాంక్స్ చెబుతున్నారు.


By June 11, 2020 at 11:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sri-reddy-birthday-wishes-to-balakrishna-he-doesnt-need-a-padma-shri/articleshow/76315303.cms

No comments