ప్రియుడితో పెళ్లి ఫోటోలు వైరల్.... కాబోయే భర్తకు తెలిసిపోయిందని యువతి ఆత్మహత్య
ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న యువతి.. ఆ విషయాన్ని దాచిపెట్టి మళ్లీ పెద్దలు కుదర్చిన మరో యువకుడిన పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ఇది తెలుసుకున్న ప్రియుడు తమ పెళ్లి ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపించాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో మనస్తాపానికి చెందిన యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని దౌల్తాబాద్ మండలంలోని కుదురుమళ్ల గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి(23) మహబూబ్‌నగర్‌లో బీఈడీ ఫస్టియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య, ఆమె మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. Also Read: కొన్నిరోజుల క్రితం వారిద్దరు ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకొని ఫొటోలు దిగారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కాలేజీకి సెలవుల రావడంతో స్రవంతి స్వగ్రామానికి వచ్చేసింది. కర్ణాటకకు చెందిన ఓ యువకుడితో స్రవంతికి పెద్దలు ఇటీవల పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 30వ తేదీన వివాహం చేసేందుకు ఏర్పాట్ల చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య తమ పెళ్లి ఫోటోలను స్రవంతికి కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపించి.. తమకు పెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. అంతటితో ఆగకుండా అనేక వాట్సాప్ గ్రూపుల్లో తమ పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. Also Read: ఈ ఘటనపై వరుడి తరుపు వారు శైలేందర్, సరోజిని దంపతులను నిలదీశారు. పెళ్లయిన అమ్మాయికి మళ్లీ పెళ్లి చేస్తూ తమను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో తల్లిదండ్రులు స్రవంతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేసి గ్రామంలో, బంధువుల్లో తమ పరువ తీశావంటూ నిందించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం పురుగులమందు తాగేసింది. కుటుంబసభ్యులు ఆమెను కొడంగల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తండ్రి శైలేందర్ ఫిర్యాదుతో పోలీసులు ప్రియుడు తిరుపతయ్య, అతడికి సహకరించిన కోస్గి వెంటకయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By June 05, 2020 at 10:03AM
No comments