Breaking News

ఆసుపత్రిలో బాలింత అనుమానాస్పద మృతి.. డాక్టర్లపై కేసు నమోదు


ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన మహిళ బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌‌లో విషాదం నింపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. జియాగూడకు చెందిన జియాగూడలో నివాసం ఉంటున్న రాజేష్, ఆర్తి (24)లకు 2017లో వివాహం జరిగింది. ఆర్తి గర్భం దాల్చి నెలలు నిండటంతో కుటుంబసభ్యులు ప్రసవం కోసం మే 27న చింతలబస్తీలోని విజయమేరీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 28న సిజేరియన్‌ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ అనారోగ్యంగా ఉండడంతో ఎన్‌ఐసీయూలో ఉంచారు. తల్లి కోలుకోవడంతో ఆమెను డిశ్ఛార్జి చేసుకోవచ్చని 31న డాక్టర్ల సూచించారు.అయితే బిడ్డకు పాలు ఇవ్వాల్సి ఉండడంతో ఆర్తి ఆస్పత్రిలోనే ఉంది. Also Read: ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆర్తి తనకు చెస్ట్‌ పెయిన్‌ వస్తోందని చెప్పగా బాలింతకు అలాగే జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. శరీరంలో వేడి కోసం కాసేపు నడవాలని సూచించారు. ఆ రాత్రికి బాగానే ఉన్న ఆమె మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బిడ్డకు పాలిచ్చేందుకు ప్రయత్నిస్తూ బెడ్‌పై పడిపోయింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఆర్తి మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పినప్పుడు వెంటనే పరీక్షలు చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పతి వద్దకు చేరుకుని ఆర్తి బంధువులను సముదాయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆర్తి భర్త రాజేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By June 03, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-suspected-death-at-hospital-in-hyderabad-police-booked-case-on-doctors/articleshow/76167453.cms

No comments