Breaking News

భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య.. గోదావరిఖనిలో ఘోరం


మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తను అతి కిరాతకంగా చంపేసిందో ఇల్లాలు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. గోదావరిఖనికి చెందిన జీదుల రాంబాబు(49) మంథని మండలం విలోచవరంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల మద్యానికి బానిసైన రాంబాబు రోజూ తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాంబాబు భార్యతో గొడవ పడ్డాడు. భర్త వేధింపులలో విసిగిపోయిన మంజుల అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. నిద్రపోతున్న అతడి చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేసింది. తెల్లవారాక తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని ప్రచారం చేసింది. అయితే రాంబాబు తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో భర్తను తానే చంపేనని మంజుల అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By June 12, 2020 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-her-husband-in-godavarikhani-over-harassment/articleshow/76331847.cms

No comments