Breaking News

కన్నబిడ్డనే గర్భవతిని చేసిన తండ్రి.. హైదరాబాద్‌లో దారుణం


కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతూ గర్భవతిని చేసిన దారుణ ఘటన తెలంగాణలోని హైదరాబాద్‌ నగర శివారు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో వెలుగుచూసింది. కర్ణాటకలోని దర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. సూరారం శివాలయ నగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే అందరినీ చంపేస్తానని బెదింరించాడు. Also Read: అంతటితో ఆగకుండా అప్పుడప్పుడూ కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆమె గర్భం దాల్చినట్లు డాక్టర్లు చెప్పడంతో కూతురిని నిలదీయగా తండ్రి నిర్వాకం బయటపడింది. దీంతో ఇంటికెళ్లి భర్తను నిలదీయగా అందరినీ చంపేస్తానని బెదిరించడంతో ఆమె మిన్నకుండిపోయింది. దీంతో కూతురికి గుట్టుచప్పుడు అబార్షన్ చేయించేందుకు భార్యభర్తలిద్దరూ ప్రయత్నించినా లాక్‌డౌన్ కారణంగా సాధ్యం కాలేదు. Also Read: ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భవతి. ఆమె శరీరంలో భారీగా మార్పులు రావడాన్ని గమనించిన స్థానికులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వారు బాలిక తల్లిని నిలదీయగా తన భర్తే ఆ దారుణానికి పాల్పడినట్లు చెప్పడంతో వారు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి అప్పగించారు. దీంతో పోలీసులు నిందితుడపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామంతో కన్నకూతురి జీవితాన్నే నాశనం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. Also Read:


By June 18, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-rapes-daughter-arrested-after-girl-gets-pregnancy/articleshow/76436661.cms

No comments