ప్రైవేటు బస్సు ఢీకొని నర్సు మృతి.. హైదరాబాద్‌లో విషాదం
ప్రైవేటు బస్సు ఢీకొని స్కూటీపై వెళ్తున్ యువతి మృతిచెందిన విషాదకర ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గురువారం జరిగింది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లికి చెందిన భూమయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. రెండో కూతురు బేగరి ప్రమీల(24) కొన్నాళ్లుగా బంజారాహిల్స్‌లోని ఒమెగా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ ఐడీఏ బొల్లారంలోని బంధువు బేతయ్య ఇంట్లో ఉంటుంది. గురువారం ఉదయం 8 సమయంలో రోజూ మాదిరిగానే బేతయ్య స్కూటీపై ప్రమీలతో కలిసి బంజారాహిల్స్ బయలుదేరాడు. Also Read: వారు బాచుపల్లి-మియాపూర్ రోడ్డులో కొకోలా కంపెనీ చౌరస్తా వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్.కె.ట్రావెల్స్‌కు చెందిన బస్సు స్కూటీని పక్క నుంచి రాసుకుంటూ వెళ్లిపోయింది. ఈ క్రమంలో ప్రమీల అదుపుతప్పి బస్సు వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బేతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. పోతయ్యను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By June 05, 2020 at 07:37AM
No comments