Breaking News

ఆ క్రికెటర్ అంటే చాలా ఇష్టం.. అతనే నా ఫేవరేట్ కూడా: పూజా హెగ్డే


తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది హీరోయిన్ . ''అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్'' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ.. 2020 ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న పూజా, అప్పుడప్పుడు ఆన్‌లైన్ వేదికలపై లైవ్ చాట్స్ చేస్తూ తన అభిమానులను పలకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసిన పూజా హెగ్డే పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఇందులో భాగంగా మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నపై బదులిస్తూ.. ఇంకెవరు మిస్టర్ డిపెండబుల్ అని వెంటనే రియాక్ట్ అయింది. అంతేకాదు క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులో రాహుల్ ద్రవిడ్ ఆట తీరంటే ఇంకా ఇష్టమని తెలిపింది. తాను రాహుల్ ద్రవిడ్‌కి వీరాభిమానిని అని చెప్పిన పూజా హెగ్డే.. ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లున్నా వారెవరూ రాహుల్ ద్రవిడ్‌కు సాటిరారని చెప్పడం విశేషం. ద్రవిడ్ ఓ కూల్ అండ్ క్లాసిక్ ప్లేయర్ అని కితాబిచ్చింది పూజా.‌ ఈ తరం ఆటగాళ్ల విషయానికొస్తే ధోని, కేఎల్ రాహుల్ ఆటతీరును ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇండియన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తానని, క్రికెట్ పట్ల తనకున్న ఇష్టం అలాంటిదని ఆమె చెప్పింది. ఇక పూజా హెగ్డే- ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమా విశేషాల గురించి చూస్తే.. ఇదో పీరియాడిక్ లవ్‌స్టోరీ అని తెలిసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో పూజా అందాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని టాక్. అతిత్వరలో ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది చిత్రయూనిట్.


By June 05, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-says-her-favourite-cricketer-name-in-latest-chitchat/articleshow/76206498.cms

No comments