Breaking News

ఆస్తి కోసం తల్లి, చెల్లి దారుణహత్య... తమిళనాడులో దారుణం


ఆస్తి తగాదాల కారణంగా కన్నతల్లి, చెల్లెలి దారుణంగా చంపేశాడో కిరాతకుడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపం పరదరామి తలైవార్‌ పట్టి గ్రామానికి చెందిన ఇంద్రాణి అమ్మాళ్‌ (70)కు కుమారులు మునిరాజ్‌(40), సూరి, కుమార్తె చిన్నమ్మ ఉన్నారు. కుమారులకు వివాహమై వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. చిన్నమ్మకు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లితోనే ఉంటోంది. Also Read: కుటుంబ ఆస్తిగా వచ్చిన భూమి విషయంపై తల్లితో మునిరాజ్‌ కొన్నాళ్లుగా గొడవ పడుతున్నాడు. ఆస్తిలో తన వాటాను పంచాల్సిందిగా కోరుతుండగా కూతురికి పెళ్లి చేసేవరకు ఆస్తి పంచేది లేదని ఆమె తెగేసి చెబుతోంది. ఇదే విషయమై మునిరాజ్ బుధవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో కొబ్బరిమట్ట, రాళ్లతో తల్లి, చెల్లిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో మునిరాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By June 11, 2020 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamil-nadu-man-kills-mother-and-sister-over-property-disputes/articleshow/76312955.cms

No comments